Skip to main content

నా రైలు ప్రయాణం

భగ్గుమంటున్న సూర్యుని వేడి ఈదురు గాలులు
సన్నని నాగుపాములా మెలికలు తిరిగిన రైలు పట్టాలు
అనుక్షణం సంగీతం పడుతున్న చుక్ చుక్  శబ్దాలు
ప్రతినిమిషం ఆకలి దప్పికలు తీర్చే తినుభండారాలు
సీటు కోసం టి.టి వెంట తిరిగే యాత్రికుల కష్టాలు
ఏమని చెప్పను నా రైలు ప్రయాణ విశేషాలు
ప్రతి నిమిషం కొత్త భారతాన్ని చూపించిన ఆ దృశ్యాలు


ఎన్నడూ చెయ్యలేదు ఈ  ముపై  ఆరు గంటల ప్రయాణం
ఎన్నడూ మరువలేను నా మొదటి ప్రయాణ అనుభవం
భారంగా సాగుతూ రైలు ఆగడానికి వచ్చిన ప్రతి క్షణం
ఎందరు ఎక్కుతారో అని దడదడలాడెను నా హృదయం
ఎప్పటికీ తగ్గని ఈ టికెట్ లేని ప్రయాణికుల ప్రవాహం
నా సీట్ ఏదో నేనే మర్చిపోయేలా చేసిన ఆ తరుణం
అప్పుడప్పుడు ఊరిస్తూ వచ్చే సెల్ ఫోన్ సిగ్నళ్ళు
ప్రతి రాష్ట్రానికి స్వాగతాలు చెప్పే ఆ తీయని సందేశాలు
రైలు రాకను తెలిపే స్టేషన్ లోని ద్విభాషా అన్నౌన్సుమెంట్లు


ఇవేమీ పట్టనట్టు తమ లోకంలో ఆటలాడు పేకాట వీరులు
రైలు ఎక్కామన్నసంభ్రమములో అల్లర్లు చేసే చిన్న పిల్లలు
తమవారి జాగ్రతలు చూస్తూ ప్రకృతిని ఆస్వాదించే భార్యామణులు
అస్సలు ప్రపంచమే అది అన్నట్లు ఫోనులో బతికేసే సుందరాంగులు
ఇవ్వని చూస్తూ కాలం గడిపేసే నాలాంటి పనిలేని యువకులు
ఇలా ఆ ఒక్కరోజు మిగిల్చెను నాకు ఎన్నెనో మధురానుభూతులు
ఇలా మరెన్నో ప్రయాణాలు చేస్తాన్నన ఆశతో నాఈ వీడుకోలు 

Comments

  1. wow...telugu lo naku padalu dorakala ninu abhinandinchadaniki...!!!

    nee e railu prayanam neku okkadike kadu maku kuda oka teeyani anubhutini miglichindi...!!!

    thanks for the write up..!!!

    ReplyDelete
  2. waah..whom am I seeing back again..its been an age i saw you here...... thanx :)

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Acrostic Poems!!!!!

This was all we were asked to do today in my Minor..........write Acrostic Poems and here are a few which I wrote.... On M Santosh Kumar on his request M y God!!! I never realised it S atires is what he cracks in K iller he is with those instincts On LOVE after ma'am reminding we are close to Feb 14th L eaning on you under an O ak tree,I enter a V ast world of happiness E verything we are in is sheer bliss

నగరం పులికించిన వేళ

భగ భగ మండుతున్న సూర్యుని తాపంతో ఈ మహానగరం మునిగి  ఉండగా  వేసవి  కాలపు  వేడి  గాలులు మెలమెల్లగా వాటి  రాకను తెలుపుతుండగా  జలజలా పారే సేలయేళే వడగాలుల తాకిడికి కదలలేక సేద తీర్చుకుండగా నా ప్రియ భాగ్యనగర రైలుస్టేషన్ లోపలికి వచ్చి ఆగింది నా రైలు సుధీర్గంగా   ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అని వడివడిగా బయటకి సాగెను నా అడుగులు  చుట్టుపక్కల మళ్ళి మళ్ళి చూస్తూ ఏదైనా మార్పుకోసం వెతికేను నా కన్నులు  బిజినెస్ పని మొదల్కొని పిచాపటి మాటల వరకు అన్ని సాగే ఆ ఇరానీ కేఫెలు  ఎప్పుడైనా ఎక్కడైనా కడుపుబ్బా తినేందుకు రోడు పక్కనే ఉన్నా ఛాట్ బండ్లు  నగర చరిత్రకీ అభివృధికీ అద్దంపట్టే ఆ కళాఖండాలు ఇంకా నవనూతన కట్టడాలు తమపర భేదాలు లేకుండా అన్ని పండగలలో ఘనంగా జరిగే అంబరవీధి సంబరాలు     మెలమెల్లగా నన్ను తడుతూ చిరునవ్వులు తెప్పించే చిన్ననాటి తీపి జ్ఞాపకాలు ఎల్లపుడూ ఇక్కడే ఉండిపోతే ఎంత హాయో అని తెలిపే ఆ మధురాలోచనలు ఈ ఆలోచనా ప్రవాహానికి అడ్డుకట్ట వెస్తూ చేర్చింది ఆటో నన్ను మా ఇంటికి  గలగలా కబుర్ల అయ్యాక ఆశగా ఎదురుచూసిన అమ్మ చేతి వంటకం తిన్నా  ఈనాటికి  తిన్నాకా అలా మాట్లాడుతూ నాకే తెలియకు

మా అన్నయ్య పెళ్ళి కబుర్లు....

మదిలో పులకింతలు మ్రోగించే మేళ తాళాల నడుమ  అంబరమే వంగి చూస్తూ చేసిన కేరింతల మధ్యన  ముక్కోటి దేవుళ్ళ ఆశిరవాదలే చిరుజల్లులై కురిసిన వేల  శ్రవనానందకరమైన వేద మంత్రాలూ నలుదిక్కుల మ్రోగిన వేల  ఇక కానివ్వండీ అని గడియారం ముహూర్తాన్ని సమీపించగా  ఇక తానూ కూడా నిలవలేనని  అడ్డుగా ఉన్న తెర  నేలకూలగా తలవంచిన వధూ వరులు ఓరకంట ఒకరినొకరు చిలిపిగా చూసుకోగా తలపై జీలకర్ర బెల్లం పెట్టి ఒక ఇంటి వాడు అయ్యాడు మా అన్నయ్య పెళ్లి పనులో అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూ ఉండే పెళ్లి పెద్దలు ఎన్నాళ్ళకో కలిసిన చుట్టాలతో ముచ్చట్లలో మునిపోయిన బంధువులు అమ్మా నాన్నల చేతులు విడిపించుకొని మండపమంతా తిరిగేసే చిన్నారులు  వీటనిటిమధ్య ఎప్పుడెప్పుడా అని ఊరించే పెళ్లి భోజనాల ఘుమఘుమలు అప్పుడే కలిసిన కొత్త కొత్త గ్యాంగులు అంతలోనే మొదలైన మా అల్లర్లు శృతి చెప్పిన చీమ ఏనుగు జోకులు, శ్రీ గాడి సమయానుకూల చమక్తులు కీర్తనకు చెప్పిన ఇంజనీరింగ్ విశేషాలు, అను చెప్పిన చిన్ననాటి కహానీలు దీనికి దానికి అని లేకుండా ప్రతి చిన్నదానికి ఫక్కుమని మా నవ్వులు అన్నిటా తన పెద్దరికాన్ని కాపాడుకోడానికి ప్రెసిడెంటు గారి కష్టాలు  అంత నవ్వును ఆపుకుంటూ దిగిన ఆ వింత