Skip to main content

Posts

Showing posts from May, 2012

నగరం పులికించిన వేళ

భగ భగ మండుతున్న సూర్యుని తాపంతో ఈ మహానగరం మునిగి  ఉండగా  వేసవి  కాలపు  వేడి  గాలులు మెలమెల్లగా వాటి  రాకను తెలుపుతుండగా  జలజలా పారే సేలయేళే వడగాలుల తాకిడికి కదలలేక సేద తీర్చుకుండగా నా ప్రియ భాగ్యనగర రైలుస్టేషన్ లోపలికి వచ్చి ఆగింది నా రైలు సుధీర్గంగా   ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అని వడివడిగా బయటకి సాగెను నా అడుగులు  చుట్టుపక్కల మళ్ళి మళ్ళి చూస్తూ ఏదైనా మార్పుకోసం వెతికేను నా కన్నులు  బిజినెస్ పని మొదల్కొని పిచాపటి మాటల వరకు అన్ని సాగే ఆ ఇరానీ కేఫెలు  ఎప్పుడైనా ఎక్కడైనా కడుపుబ్బా తినేందుకు రోడు పక్కనే ఉన్నా ఛాట్ బండ్లు  నగర చరిత్రకీ అభివృధికీ అద్దంపట్టే ఆ కళాఖండాలు ఇంకా నవనూతన కట్టడాలు తమపర భేదాలు లేకుండా అన్ని పండగలలో ఘనంగా జరిగే అంబరవీధి సంబరాలు     మెలమెల్లగా నన్ను తడుతూ చిరునవ్వులు తెప్పించే చిన్ననాటి తీపి జ్ఞాపకాలు ఎల్లపుడూ ఇక్కడే ఉండిపోతే ఎంత హాయో అని తెలిపే ఆ మధురాలోచనలు ఈ ఆలోచనా ప్రవాహానికి అడ్డుకట్ట వెస్తూ చేర్చింది ఆటో నన్ను మా ఇంటికి  గలగలా కబుర్ల అయ్యాక ఆశగా ఎదురుచూసిన అమ్మ చేతి వంటకం తిన్నా  ఈనాటికి  తిన్నాకా అలా మాట్లాడుతూ నాకే తెలియకు