Skip to main content

Posts

Showing posts from January, 2012

మా అన్నయ్య పెళ్ళి కబుర్లు....

మదిలో పులకింతలు మ్రోగించే మేళ తాళాల నడుమ  అంబరమే వంగి చూస్తూ చేసిన కేరింతల మధ్యన  ముక్కోటి దేవుళ్ళ ఆశిరవాదలే చిరుజల్లులై కురిసిన వేల  శ్రవనానందకరమైన వేద మంత్రాలూ నలుదిక్కుల మ్రోగిన వేల  ఇక కానివ్వండీ అని గడియారం ముహూర్తాన్ని సమీపించగా  ఇక తానూ కూడా నిలవలేనని  అడ్డుగా ఉన్న తెర  నేలకూలగా తలవంచిన వధూ వరులు ఓరకంట ఒకరినొకరు చిలిపిగా చూసుకోగా తలపై జీలకర్ర బెల్లం పెట్టి ఒక ఇంటి వాడు అయ్యాడు మా అన్నయ్య పెళ్లి పనులో అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూ ఉండే పెళ్లి పెద్దలు ఎన్నాళ్ళకో కలిసిన చుట్టాలతో ముచ్చట్లలో మునిపోయిన బంధువులు అమ్మా నాన్నల చేతులు విడిపించుకొని మండపమంతా తిరిగేసే చిన్నారులు  వీటనిటిమధ్య ఎప్పుడెప్పుడా అని ఊరించే పెళ్లి భోజనాల ఘుమఘుమలు అప్పుడే కలిసిన కొత్త కొత్త గ్యాంగులు అంతలోనే మొదలైన మా అల్లర్లు శృతి చెప్పిన చీమ ఏనుగు జోకులు, శ్రీ గాడి సమయానుకూల చమక్తులు కీర్తనకు చెప్పిన ఇంజనీరింగ్ విశేషాలు, అను చెప్పిన చిన్ననాటి కహానీలు దీనికి దానికి అని లేకుండా ప్రతి చిన్నదానికి ఫక్కుమని మా నవ్వులు అన్నిటా తన పెద్దరికాన్ని కాపాడుకోడానికి ప్రెసిడెంటు గారి కష్టాలు  అంత నవ్వును ఆపుకుంటూ దిగిన ఆ వింత