Skip to main content

నగరం పులికించిన వేళ

భగ భగ మండుతున్న సూర్యుని తాపంతో ఈ మహానగరం మునిగి  ఉండగా 
వేసవి  కాలపు  వేడి  గాలులు మెలమెల్లగా వాటి  రాకను తెలుపుతుండగా 
జలజలా పారే సేలయేళే వడగాలుల తాకిడికి కదలలేక సేద తీర్చుకుండగా
నా ప్రియ భాగ్యనగర రైలుస్టేషన్ లోపలికి వచ్చి ఆగింది నా రైలు సుధీర్గంగా  

ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అని వడివడిగా బయటకి సాగెను నా అడుగులు 
చుట్టుపక్కల మళ్ళి మళ్ళి చూస్తూ ఏదైనా మార్పుకోసం వెతికేను నా కన్నులు 
బిజినెస్ పని మొదల్కొని పిచాపటి మాటల వరకు అన్ని సాగే ఆ ఇరానీ కేఫెలు 
ఎప్పుడైనా ఎక్కడైనా కడుపుబ్బా తినేందుకు రోడు పక్కనే ఉన్నా ఛాట్ బండ్లు 
నగర చరిత్రకీ అభివృధికీ అద్దంపట్టే ఆ కళాఖండాలు ఇంకా నవనూతన కట్టడాలు
తమపర భేదాలు లేకుండా అన్ని పండగలలో ఘనంగా జరిగే అంబరవీధి సంబరాలు    
మెలమెల్లగా నన్ను తడుతూ చిరునవ్వులు తెప్పించే చిన్ననాటి తీపి జ్ఞాపకాలు
ఎల్లపుడూ ఇక్కడే ఉండిపోతే ఎంత హాయో అని తెలిపే ఆ మధురాలోచనలు

ఈ ఆలోచనా ప్రవాహానికి అడ్డుకట్ట వెస్తూ చేర్చింది ఆటో నన్ను మా ఇంటికి 
గలగలా కబుర్ల అయ్యాక ఆశగా ఎదురుచూసిన అమ్మ చేతి వంటకం తిన్నా  ఈనాటికి 
తిన్నాకా అలా మాట్లాడుతూ నాకే తెలియకుండా మెల్లగా జారుకున్న మంచి నిద్రలోకి
లేవంగానే హైదరాబాదు వేడి గాలుల తాకిడికై  బయలుదేరా అలా ఇంటి బయటకి 

అంతలోనే మండుతున్న సూర్యున్నిఒక్కసారిగా మ్రింగెను ఆ మబ్బుల ఆకాశం 
క్షణకాలంలోనే  పెళ పెళ మంటూ వడగళ్ళ ప్రవాహంతో కురిసెను సేదతీర్చు వర్షం
ఇన్నాళ్ళ ఎండలనుంచి  కాస్త విముక్తి కలిగించేదుకు వచ్చిందా ఈ పూల వర్షం 
లేక నా రాకను గుర్తించి  ఇంత అద్బుతంగా ఈ నగరం తెలిపిందా  తన హర్షం  

Comments

  1. madhuri kuchimanchiMay 28, 2012 at 10:56 AM

    wah waaah wah waaaah !! :D

    ReplyDelete
  2. nuvu rasavante padhyam
    antha kick ivvaledu ae madhyam
    ila rayadame kevalam neeke sadhyam
    nenu matram chustu undipoya chodhyam !

    prasa kosam pranalichanu baa :D..meaning lekapoina adjust chesko :P
    in one way if wil enlighten the readers how much effort u must hav put in or the skill u hav got in writing wid prasa and meaning together B-)

    ReplyDelete
  3. hahaa.... meaning ledu antunee antha meaning ichav kada bossu... Maree naa deggara antha modesty akkarledule...

    ReplyDelete
  4. superb sudheeer! ... love it... i showed my dad too and he likes it too :)

    ReplyDelete
  5. Vodiyamma, nuvvu inka rasthunnava!! Way to go!! :P Seriously, awesome! :) (Kartheek Konanki here!)

    ReplyDelete
  6. Mama I have been expecting your posts ra.. not writing nowadays? Busy kya??
    : Sukra

    ReplyDelete
  7. we are looking for copper wire mesh agent in your country, are you interested in it?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

మా అన్నయ్య పెళ్ళి కబుర్లు....

మదిలో పులకింతలు మ్రోగించే మేళ తాళాల నడుమ  అంబరమే వంగి చూస్తూ చేసిన కేరింతల మధ్యన  ముక్కోటి దేవుళ్ళ ఆశిరవాదలే చిరుజల్లులై కురిసిన వేల  శ్రవనానందకరమైన వేద మంత్రాలూ నలుదిక్కుల మ్రోగిన వేల  ఇక కానివ్వండీ అని గడియారం ముహూర్తాన్ని సమీపించగా  ఇక తానూ కూడా నిలవలేనని  అడ్డుగా ఉన్న తెర  నేలకూలగా తలవంచిన వధూ వరులు ఓరకంట ఒకరినొకరు చిలిపిగా చూసుకోగా తలపై జీలకర్ర బెల్లం పెట్టి ఒక ఇంటి వాడు అయ్యాడు మా అన్నయ్య పెళ్లి పనులో అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూ ఉండే పెళ్లి పెద్దలు ఎన్నాళ్ళకో కలిసిన చుట్టాలతో ముచ్చట్లలో మునిపోయిన బంధువులు అమ్మా నాన్నల చేతులు విడిపించుకొని మండపమంతా తిరిగేసే చిన్నారులు  వీటనిటిమధ్య ఎప్పుడెప్పుడా అని ఊరించే పెళ్లి భోజనాల ఘుమఘుమలు అప్పుడే కలిసిన కొత్త కొత్త గ్యాంగులు అంతలోనే మొదలైన మా అల్లర్లు శృతి చెప్పిన చీమ ఏనుగు జోకులు, శ్రీ గాడి సమయానుకూల చమక్తులు కీర్తనకు చెప్పిన ఇంజనీరింగ్ విశేషాలు, అను చెప్పిన చిన్ననాటి కహానీలు దీనికి దానికి అని లేకుండా ప్రతి చిన్నదానికి ఫక్కుమని మా నవ్వులు అన్నిటా తన పెద్దరికాన్ని కాపాడుకోడాన...

సౌందర్య లహరి ... స్వప్న సుందరి

నీ యవ్వనాన్ని తాకాలని ఉవ్విళ్ళూరుతూ పడిలేస్తున కెరటాలు  నిను  చూసి అబ్బురపడి నీకై ఆశగా వంగిన ఆ హరివిల్లు వర్ణాలు  నీ పాద స్పర్శకే తన్మయత్యం చెంది ఎగిరి దుమికే ఇసుక రేణులు ఇవేమీ పట్టనట్టు లోలకంలో కదిలే ఆ నడుము వయ్యారాలు  చూసిన ప్రతిసారి మ్రోగును నా గుండెలో ఆనందపు సరిగమలు నిను చూసిన ఆనదంలో నీ చెంతకే పరుగులు తీసెను నా అడుగులు  అంతలో ట్టక్కున తెరుచు కొనెను మంచి నిద్రనుంచి నా కన్నులూ ఆహా!! ప్రతిదినం నీ దర్శనం నాకు ఈ కలల సామ్రాజ్యంలోనేనా లేక ఎన్నటికైనా నిన్ను కలవాలనే నా చిన్న కోరిక తీరేనా  నేనో  కవినైనా కాకపోతేనే నీ ముఖ ఖవలికలు వర్ణించుటకు  శిల్పినో చిత్రకారుడినో కానే నీ సౌందర్యాని చెక్కి చూసేందుకు ఎన్నాళ్లని ఇలా నా కలలో మెదులుతూ ఊరిస్తూ ఉంటావు   నాకై ఓ క్షణమైనా కనిపించి ఈ మనోవేదన దూరం చెయ్యవూ కలలోనైనా నిను చూసేందుకు  నిద్రలోనే జీవితం గడిపెయనా  లేక నిద్రాహారాలు మాని నీ వెతుకులాటలో ప్రయాణాలు సాగించనా ఎదీ తేల్చుకోలేక మదనపడే ఈ మనసుకు జవాబు దొరికేనా  ఈ సంగ్దిత్త పరిస్తితి నుంచి బైటు వచ్చే మార్గం కనిపించేనా