భగ భగ మండుతున్న సూర్యుని తాపంతో ఈ మహానగరం మునిగి ఉండగా వేసవి కాలపు వేడి గాలులు మెలమెల్లగా వాటి రాకను తెలుపుతుండగా జలజలా పారే సేలయేళే వడగాలుల తాకిడికి కదలలేక సేద తీర్చుకుండగా నా ప్రియ భాగ్యనగర రైలుస్టేషన్ లోపలికి వచ్చి ఆగింది నా రైలు సుధీర్గంగా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అని వడివడిగా బయటకి సాగెను నా అడుగులు చుట్టుపక్కల మళ్ళి మళ్ళి చూస్తూ ఏదైనా మార్పుకోసం వెతికేను నా కన్నులు బిజినెస్ పని మొదల్కొని పిచాపటి మాటల వరకు అన్ని సాగే ఆ ఇరానీ కేఫెలు ఎప్పుడైనా ఎక్కడైనా కడుపుబ్బా తినేందుకు రోడు పక్కనే ఉన్నా ఛాట్ బండ్లు నగర చరిత్రకీ అభివృధికీ అద్దంపట్టే ఆ కళాఖండాలు ఇంకా నవనూతన కట్టడాలు తమపర భేదాలు లేకుండా అన్ని పండగలలో ఘనంగా...