భగ్గుమంటున్న సూర్యుని వేడి ఈదురు గాలులు సన్నని నాగుపాములా మెలికలు తిరిగిన రైలు పట్టాలు అనుక్షణం సంగీతం పడుతున్న చుక్ చుక్ శబ్దాలు ప్రతినిమిషం ఆకలి దప్పికలు తీర్చే తినుభండారాలు సీటు కోసం టి.టి వెంట తిరిగే యాత్రికుల కష్టాలు ఏమని చెప్పను నా రైలు ప్రయాణ విశేషాలు ప్రతి నిమిషం కొత్త భారతాన్ని చూపించిన ఆ దృశ్యాలు ఎన్నడూ చెయ్యలేదు ఈ ముపై ఆరు గంటల ప్రయాణం ఎన్నడూ మరువలేను నా మొదటి ప్రయాణ అనుభవం భారంగా సాగుతూ రైలు ఆగడానికి వచ్చిన ప్రతి క్షణం ఎందరు ఎక్కుతారో అని దడదడలాడెను నా హృదయం ఎప్పటికీ తగ్గని ఈ టికెట్ లేని ప్రయాణికుల ప్రవాహం నా సీట్ ఏదో నేనే మర్చిపోయేలా చేసిన ఆ తరుణం అప్పుడప్పుడు ఊరిస్తూ వచ్చే సెల్ ఫోన్ సిగ్నళ్ళు ప్రతి రాష్ట్రానికి స్వాగతాలు చెప్పే ఆ తీయని సందేశాలు రైలు రాకను తెలిపే స్టేషన్ లోని ద్విభాషా అన్నౌన్సుమెంట్లు ఇవేమీ పట్టనట్టు తమ లోకంలో ఆటలాడు పేకాట వీరులు రైలు ఎక్కామన్నసంభ్రమములో అల్లర్లు చేసే చిన్న పిల్లలు తమవారి జాగ్రతలు చూస్తూ ప్రకృతిని ఆస్వాదించే భార్యామణులు అస్సలు ప్రపంచమే అది అన్నట్లు ఫోనులో బతికేసే సుందరాంగులు ఇవ...