నీ యవ్వనాన్ని తాకాలని ఉవ్విళ్ళూరుతూ పడిలేస్తున కెరటాలు నిను చూసి అబ్బురపడి నీకై ఆశగా వంగిన ఆ హరివిల్లు వర్ణాలు నీ పాద స్పర్శకే తన్మయత్యం చెంది ఎగిరి దుమికే ఇసుక రేణులు ఇవేమీ పట్టనట్టు లోలకంలో కదిలే ఆ నడుము వయ్యారాలు చూసిన ప్రతిసారి మ్రోగును నా గుండెలో ఆనందపు సరిగమలు నిను చూసిన ఆనదంలో నీ చెంతకే పరుగులు తీసెను నా అడుగులు అంతలో ట్టక్కున తెరుచు కొనెను మంచి నిద్రనుంచి నా కన్నులూ ఆహా!! ప్రతిదినం నీ దర్శనం నాకు ఈ కలల సామ్రాజ్యంలోనేనా లేక ఎన్నటికైనా నిన్ను కలవాలనే నా చిన్న కోరిక తీరేనా నేనో కవినైనా కాకపోతేనే నీ ముఖ ఖవలికలు వర్ణించుటకు శిల్పినో చిత్రకారుడినో కానే నీ సౌందర్యాని చెక్కి చూసేందుకు ఎన్నాళ్లని ఇలా నా కలలో మెదులుతూ ఊరిస్తూ ఉంటావు నాకై ఓ క్షణమైనా కనిపించి ఈ మనోవేదన దూరం చెయ్యవూ కలలోనైనా నిను చూసేందుకు నిద్రలోనే జీవితం గడిపెయనా లేక నిద్రాహారాలు మాని నీ వెతుకులాటలో ప్రయాణాలు సాగించనా ఎదీ తేల్చుకోలేక మదనపడే ఈ మనసుకు జవాబు దొరికేనా ఈ సంగ్దిత్త పరిస్తితి నుంచి బైటు వచ్చే మార్గం కనిపించేనా