ఇరవై ఏళ్ళుగా ఎప్పుడూ చూడని ఈ సౌందర్యం హట్టాతుగా ఎదుట వస్తే ఏమవును నా హృదయం ఎన్నడూ ఊహించని ఈ అద్భుత తరుణం కలయూ నిజమో తేల్చుకోలేని సంగ్దిద్దం చిరుగాలులకి లయబద్ధంగా నర్తించే నీ కురులు చిరునవ్వుల్లు చిలికించే నీ మధుర అధరాలు చూపులతోనే మనసు దోచే నీ నయనాలు చంద్రునికే ఈర్ష కలిగించే ఆ మేని అందాలు చూడగానే అర్పించా నీకయి నా పంచప్రాణాలు చూస్తూనే గడిపేస్తా నీకయి ఎన్నెనో యుగాలు తొలిచూపులోనే పలికించావు నా హృదయంలో సుస్వరం మలి చూపులోనే అర్పించా నీ పాదాలపై నా సర్వస్వం నీతో మాట్లాడాలని ఉవ్విళ్లూరెను నా యవ్వనం నీ చెంతకు వస్తే మూగబోయెను నా కంట్టస్వరం ఏమని చెప్తే తగ్గును నా మదిలోని ఈ భారం ఎన్నడు తెలియను నీకు నా చూపులోని భావం తెలియక చస్తున్న నీకు నా మీద ఉన్న అభిప్రాయం అడగాలంటే అడ్డువస్తోంది నీ మీద ఉన్న అభిమానం నీతో గడిపిన ఆ అపురూప క్షణములు మధురమే నీకై విడిచిన ఆ విరహపు నిట్టూర్పులు మధురమే నీకై నా హృదయంలో కలిగిన అలజడులు మధురమే నీతో కలిసి బతకాలని ఆశించే నాలోని ప్రేమా మధురమే