భగ భగ మండుతున్న సూర్యుని తాపంతో ఈ మహానగరం మునిగి ఉండగా వేసవి కాలపు వేడి గాలులు మెలమెల్లగా వాటి రాకను తెలుపుతుండగా జలజలా పారే సేలయేళే వడగాలుల తాకిడికి కదలలేక సేద తీర్చుకుండగా నా ప్రియ భాగ్యనగర రైలుస్టేషన్ లోపలికి వచ్చి ఆగింది నా రైలు సుధీర్గంగా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అని వడివడిగా బయటకి సాగెను నా అడుగులు చుట్టుపక్కల మళ్ళి మళ్ళి చూస్తూ ఏదైనా మార్పుకోసం వెతికేను నా కన్నులు బిజినెస్ పని మొదల్కొని పిచాపటి మాటల వరకు అన్ని సాగే ఆ ఇరానీ కేఫెలు ఎప్పుడైనా ఎక్కడైనా కడుపుబ్బా తినేందుకు రోడు పక్కనే ఉన్నా ఛాట్ బండ్లు నగర చరిత్రకీ అభివృధికీ అద్దంపట్టే ఆ కళాఖండాలు ఇంకా నవనూతన కట్టడాలు తమపర భేదాలు లేకుండా అన్ని పండగలలో ఘనంగా జరిగే అంబరవీధి సంబరాలు మెలమెల్లగా నన్ను తడుతూ చిరునవ్వులు తెప్పించే చిన్ననాటి తీపి జ్ఞాపకాలు ఎల్లపుడూ ఇక్కడే ఉండిపోతే ఎంత హాయో అని తెలిపే ఆ మధురాలోచనలు ఈ ఆలోచనా ప్రవాహానికి అడ్డుకట్ట వెస్తూ చేర్చింది ఆటో నన్ను మా ఇంటికి గలగలా కబుర్ల అయ్యాక ఆశగా ఎదురుచూసిన అమ్మ చేతి వంటకం తిన్నా ఈనాటికి తిన్నాకా అలా మాట్లాడుతూ నాకే తెలియకు
మదిలో పులకింతలు మ్రోగించే మేళ తాళాల నడుమ అంబరమే వంగి చూస్తూ చేసిన కేరింతల మధ్యన ముక్కోటి దేవుళ్ళ ఆశిరవాదలే చిరుజల్లులై కురిసిన వేల శ్రవనానందకరమైన వేద మంత్రాలూ నలుదిక్కుల మ్రోగిన వేల ఇక కానివ్వండీ అని గడియారం ముహూర్తాన్ని సమీపించగా ఇక తానూ కూడా నిలవలేనని అడ్డుగా ఉన్న తెర నేలకూలగా తలవంచిన వధూ వరులు ఓరకంట ఒకరినొకరు చిలిపిగా చూసుకోగా తలపై జీలకర్ర బెల్లం పెట్టి ఒక ఇంటి వాడు అయ్యాడు మా అన్నయ్య పెళ్లి పనులో అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూ ఉండే పెళ్లి పెద్దలు ఎన్నాళ్ళకో కలిసిన చుట్టాలతో ముచ్చట్లలో మునిపోయిన బంధువులు అమ్మా నాన్నల చేతులు విడిపించుకొని మండపమంతా తిరిగేసే చిన్నారులు వీటనిటిమధ్య ఎప్పుడెప్పుడా అని ఊరించే పెళ్లి భోజనాల ఘుమఘుమలు అప్పుడే కలిసిన కొత్త కొత్త గ్యాంగులు అంతలోనే మొదలైన మా అల్లర్లు శృతి చెప్పిన చీమ ఏనుగు జోకులు, శ్రీ గాడి సమయానుకూల చమక్తులు కీర్తనకు చెప్పిన ఇంజనీరింగ్ విశేషాలు, అను చెప్పిన చిన్ననాటి కహానీలు దీనికి దానికి అని లేకుండా ప్రతి చిన్నదానికి ఫక్కుమని మా నవ్వులు అన్నిటా తన పెద్దరికాన్ని కాపాడుకోడానికి ప్రెసిడెంటు గారి కష్టాలు అంత నవ్వును ఆపుకుంటూ దిగిన ఆ వింత