Skip to main content

మా అన్నయ్య పెళ్ళి కబుర్లు....

మదిలో పులకింతలు మ్రోగించే మేళ తాళాల నడుమ 
అంబరమే వంగి చూస్తూ చేసిన కేరింతల మధ్యన 
ముక్కోటి దేవుళ్ళ ఆశిరవాదలే చిరుజల్లులై కురిసిన వేల 
శ్రవనానందకరమైన వేద మంత్రాలూ నలుదిక్కుల మ్రోగిన వేల 

ఇక కానివ్వండీ అని గడియారం ముహూర్తాన్ని సమీపించగా 
ఇక తానూ కూడా నిలవలేనని అడ్డుగా ఉన్న తెర నేలకూలగా
తలవంచిన వధూ వరులు ఓరకంట ఒకరినొకరు చిలిపిగా చూసుకోగా
తలపై జీలకర్ర బెల్లం పెట్టి ఒక ఇంటి వాడు అయ్యాడు మా అన్నయ్య

పెళ్లి పనులో అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూ ఉండే పెళ్లి పెద్దలు
ఎన్నాళ్ళకో కలిసిన చుట్టాలతో ముచ్చట్లలో మునిపోయిన బంధువులు
అమ్మా నాన్నల చేతులు విడిపించుకొని మండపమంతా తిరిగేసే చిన్నారులు 
వీటనిటిమధ్య ఎప్పుడెప్పుడా అని ఊరించే పెళ్లి భోజనాల ఘుమఘుమలు

అప్పుడే కలిసిన కొత్త కొత్త గ్యాంగులు అంతలోనే మొదలైన మా అల్లర్లు
శృతి చెప్పిన చీమ ఏనుగు జోకులు, శ్రీ గాడి సమయానుకూల చమక్తులు
కీర్తనకు చెప్పిన ఇంజనీరింగ్ విశేషాలు, అను చెప్పిన చిన్ననాటి కహానీలు
దీనికి దానికి అని లేకుండా ప్రతి చిన్నదానికి ఫక్కుమని మా నవ్వులు

అన్నిటా తన పెద్దరికాన్ని కాపాడుకోడానికి ప్రెసిడెంటు గారి కష్టాలు 
అంత నవ్వును ఆపుకుంటూ దిగిన ఆ వింత వింత గ్రూపు ఫోటోలు
ఇంతటి మమ్మల్ని కూడా నిశబ్దం చేసిన తిరుపతి కొండ లోయలు 
రైలులో కాపలా కాస్తూ రాత్రంతా చెప్పుకున్న ఎన్నెనో కబుర్లు 
అంతా కలగలిపి ఈ పెళ్లి మిగిల్చేను ఎనో  మధురానుభూతులు
ఇలాంటి రోజు మళ్లీ ఎప్పుడు వచ్చునో అని నా ఎదురుచూపులు 

Comments

  1. Tharachu dhorikina theenekaina (honey) theepi tharugu
    Madhurasmruthulu mari mari dhorakaraadhu


    wish your brother a happy married life..

    ReplyDelete
  2. abbabbabbaa na bhooto na bhavishyat ;)

    ReplyDelete
  3. loved the last 2 paragraphs! reminded me of the whole trip!
    man, neelo ee kothha konam naku ippude telsindi!! super suupper!!

    ReplyDelete
  4. @Sukra: Thanks :) Thats how life is... memories dont return :)

    @deepthy and sreerag: Thanks thanks :)

    ReplyDelete
  5. Awesome, Gay!(If you don't mind us still calling you that :P) You just dragged the reader into your memory. Wonderful. I'm yet to read your older posts. If I may correct, a couple of typos in the third verse. "ఇక తానూ కూడా నిలవలేనని అడ్డుగా ఉన్న తెర నేలకూలగా.."- :)

    ReplyDelete
  6. I dont have any issues till this calling is limited and doesnt find place on social networking ;)

    Thanks for your inputs and I would love to hear the corrections.. kinda expecting some typos/spell errors.... but self editing never showcases them :)

    ReplyDelete
  7. madhuri kuchimanchiMarch 10, 2012 at 9:06 AM

    wooo emanna telugu vachaa niku., chaala bagundi ., nyc to a writer too in u :) keep rocking nigga!!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

నగరం పులికించిన వేళ

భగ భగ మండుతున్న సూర్యుని తాపంతో ఈ మహానగరం మునిగి  ఉండగా  వేసవి  కాలపు  వేడి  గాలులు మెలమెల్లగా వాటి  రాకను తెలుపుతుండగా  జలజలా పారే సేలయేళే వడగాలుల తాకిడికి కదలలేక సేద తీర్చుకుండగా నా ప్రియ భాగ్యనగర రైలుస్టేషన్ లోపలికి వచ్చి ఆగింది నా రైలు సుధీర్గంగా   ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అని వడివడిగా బయటకి సాగెను నా అడుగులు  చుట్టుపక్కల మళ్ళి మళ్ళి చూస్తూ ఏదైనా మార్పుకోసం వెతికేను నా కన్నులు  బిజినెస్ పని మొదల్కొని పిచాపటి మాటల వరకు అన్ని సాగే ఆ ఇరానీ కేఫెలు  ఎప్పుడైనా ఎక్కడైనా కడుపుబ్బా తినేందుకు రోడు పక్కనే ఉన్నా ఛాట్ బండ్లు  నగర చరిత్రకీ అభివృధికీ అద్దంపట్టే ఆ కళాఖండాలు ఇంకా నవనూతన కట్టడాలు తమపర భేదాలు లేకుండా అన్ని పండగలలో ఘనంగా...

సౌందర్య లహరి ... స్వప్న సుందరి

నీ యవ్వనాన్ని తాకాలని ఉవ్విళ్ళూరుతూ పడిలేస్తున కెరటాలు  నిను  చూసి అబ్బురపడి నీకై ఆశగా వంగిన ఆ హరివిల్లు వర్ణాలు  నీ పాద స్పర్శకే తన్మయత్యం చెంది ఎగిరి దుమికే ఇసుక రేణులు ఇవేమీ పట్టనట్టు లోలకంలో కదిలే ఆ నడుము వయ్యారాలు  చూసిన ప్రతిసారి మ్రోగును నా గుండెలో ఆనందపు సరిగమలు నిను చూసిన ఆనదంలో నీ చెంతకే పరుగులు తీసెను నా అడుగులు  అంతలో ట్టక్కున తెరుచు కొనెను మంచి నిద్రనుంచి నా కన్నులూ ఆహా!! ప్రతిదినం నీ దర్శనం నాకు ఈ కలల సామ్రాజ్యంలోనేనా లేక ఎన్నటికైనా నిన్ను కలవాలనే నా చిన్న కోరిక తీరేనా  నేనో  కవినైనా కాకపోతేనే నీ ముఖ ఖవలికలు వర్ణించుటకు  శిల్పినో చిత్రకారుడినో కానే నీ సౌందర్యాని చెక్కి చూసేందుకు ఎన్నాళ్లని ఇలా నా కలలో మెదులుతూ ఊరిస్తూ ఉంటావు   నాకై ఓ క్షణమైనా కనిపించి ఈ మనోవేదన దూరం చెయ్యవూ కలలోనైనా నిను చూసేందుకు  నిద్రలోనే జీవితం గడిపెయనా  లేక నిద్రాహారాలు మాని నీ వెతుకులాటలో ప్రయాణాలు సాగించనా ఎదీ తేల్చుకోలేక మదనపడే ఈ మనసుకు జవాబు దొరికేనా  ఈ సంగ్దిత్త పరిస్తితి నుంచి బైటు వచ్చే మార్గం కనిపించేనా 

My first ever flight......

Wrote somewhere in June after my first ever flight journey on 11/06/2010 With the seat belt tightened around, I lie Counting every second till its time to fly as the flight started racing to its top speed I could feel the blood rushing in my head May be the nervousness of my first ever flight taking off or the sight of hot air-hostesses making their way off  even with strong ACs blowing right onto my head I was busy wiping the sweat off my forehead While I was caught up in calming my nerves down with a hint of jerk, the flight made its way off the town As my first ever flight started parting away from ground I could see a rushing concrete jungle being left behind within another few moments, I knew I was in mid-air where such a huge flight moved just like a feather in air I was lost peeping through window, with mouth wide open As if a child seeing his 'long-awaited birthday present' open I hardly knew how the next few hours of journey went on until I saw a series of lights ...