Skip to main content

నా రైలు ప్రయాణం

భగ్గుమంటున్న సూర్యుని వేడి ఈదురు గాలులు
సన్నని నాగుపాములా మెలికలు తిరిగిన రైలు పట్టాలు
అనుక్షణం సంగీతం పడుతున్న చుక్ చుక్  శబ్దాలు
ప్రతినిమిషం ఆకలి దప్పికలు తీర్చే తినుభండారాలు
సీటు కోసం టి.టి వెంట తిరిగే యాత్రికుల కష్టాలు
ఏమని చెప్పను నా రైలు ప్రయాణ విశేషాలు
ప్రతి నిమిషం కొత్త భారతాన్ని చూపించిన ఆ దృశ్యాలు


ఎన్నడూ చెయ్యలేదు ఈ  ముపై  ఆరు గంటల ప్రయాణం
ఎన్నడూ మరువలేను నా మొదటి ప్రయాణ అనుభవం
భారంగా సాగుతూ రైలు ఆగడానికి వచ్చిన ప్రతి క్షణం
ఎందరు ఎక్కుతారో అని దడదడలాడెను నా హృదయం
ఎప్పటికీ తగ్గని ఈ టికెట్ లేని ప్రయాణికుల ప్రవాహం
నా సీట్ ఏదో నేనే మర్చిపోయేలా చేసిన ఆ తరుణం
అప్పుడప్పుడు ఊరిస్తూ వచ్చే సెల్ ఫోన్ సిగ్నళ్ళు
ప్రతి రాష్ట్రానికి స్వాగతాలు చెప్పే ఆ తీయని సందేశాలు
రైలు రాకను తెలిపే స్టేషన్ లోని ద్విభాషా అన్నౌన్సుమెంట్లు


ఇవేమీ పట్టనట్టు తమ లోకంలో ఆటలాడు పేకాట వీరులు
రైలు ఎక్కామన్నసంభ్రమములో అల్లర్లు చేసే చిన్న పిల్లలు
తమవారి జాగ్రతలు చూస్తూ ప్రకృతిని ఆస్వాదించే భార్యామణులు
అస్సలు ప్రపంచమే అది అన్నట్లు ఫోనులో బతికేసే సుందరాంగులు
ఇవ్వని చూస్తూ కాలం గడిపేసే నాలాంటి పనిలేని యువకులు
ఇలా ఆ ఒక్కరోజు మిగిల్చెను నాకు ఎన్నెనో మధురానుభూతులు
ఇలా మరెన్నో ప్రయాణాలు చేస్తాన్నన ఆశతో నాఈ వీడుకోలు 

Comments

  1. wow...telugu lo naku padalu dorakala ninu abhinandinchadaniki...!!!

    nee e railu prayanam neku okkadike kadu maku kuda oka teeyani anubhutini miglichindi...!!!

    thanks for the write up..!!!

    ReplyDelete
  2. waah..whom am I seeing back again..its been an age i saw you here...... thanx :)

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

నగరం పులికించిన వేళ

భగ భగ మండుతున్న సూర్యుని తాపంతో ఈ మహానగరం మునిగి  ఉండగా  వేసవి  కాలపు  వేడి  గాలులు మెలమెల్లగా వాటి  రాకను తెలుపుతుండగా  జలజలా పారే సేలయేళే వడగాలుల తాకిడికి కదలలేక సేద తీర్చుకుండగా నా ప్రియ భాగ్యనగర రైలుస్టేషన్ లోపలికి వచ్చి ఆగింది నా రైలు సుధీర్గంగా   ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అని వడివడిగా బయటకి సాగెను నా అడుగులు  చుట్టుపక్కల మళ్ళి మళ్ళి చూస్తూ ఏదైనా మార్పుకోసం వెతికేను నా కన్నులు  బిజినెస్ పని మొదల్కొని పిచాపటి మాటల వరకు అన్ని సాగే ఆ ఇరానీ కేఫెలు  ఎప్పుడైనా ఎక్కడైనా కడుపుబ్బా తినేందుకు రోడు పక్కనే ఉన్నా ఛాట్ బండ్లు  నగర చరిత్రకీ అభివృధికీ అద్దంపట్టే ఆ కళాఖండాలు ఇంకా నవనూతన కట్టడాలు తమపర భేదాలు లేకుండా అన్ని పండగలలో ఘనంగా...

సౌందర్య లహరి ... స్వప్న సుందరి

నీ యవ్వనాన్ని తాకాలని ఉవ్విళ్ళూరుతూ పడిలేస్తున కెరటాలు  నిను  చూసి అబ్బురపడి నీకై ఆశగా వంగిన ఆ హరివిల్లు వర్ణాలు  నీ పాద స్పర్శకే తన్మయత్యం చెంది ఎగిరి దుమికే ఇసుక రేణులు ఇవేమీ పట్టనట్టు లోలకంలో కదిలే ఆ నడుము వయ్యారాలు  చూసిన ప్రతిసారి మ్రోగును నా గుండెలో ఆనందపు సరిగమలు నిను చూసిన ఆనదంలో నీ చెంతకే పరుగులు తీసెను నా అడుగులు  అంతలో ట్టక్కున తెరుచు కొనెను మంచి నిద్రనుంచి నా కన్నులూ ఆహా!! ప్రతిదినం నీ దర్శనం నాకు ఈ కలల సామ్రాజ్యంలోనేనా లేక ఎన్నటికైనా నిన్ను కలవాలనే నా చిన్న కోరిక తీరేనా  నేనో  కవినైనా కాకపోతేనే నీ ముఖ ఖవలికలు వర్ణించుటకు  శిల్పినో చిత్రకారుడినో కానే నీ సౌందర్యాని చెక్కి చూసేందుకు ఎన్నాళ్లని ఇలా నా కలలో మెదులుతూ ఊరిస్తూ ఉంటావు   నాకై ఓ క్షణమైనా కనిపించి ఈ మనోవేదన దూరం చెయ్యవూ కలలోనైనా నిను చూసేందుకు  నిద్రలోనే జీవితం గడిపెయనా  లేక నిద్రాహారాలు మాని నీ వెతుకులాటలో ప్రయాణాలు సాగించనా ఎదీ తేల్చుకోలేక మదనపడే ఈ మనసుకు జవాబు దొరికేనా  ఈ సంగ్దిత్త పరిస్తితి నుంచి బైటు వచ్చే మార్గం కనిపించేనా 

My first ever flight......

Wrote somewhere in June after my first ever flight journey on 11/06/2010 With the seat belt tightened around, I lie Counting every second till its time to fly as the flight started racing to its top speed I could feel the blood rushing in my head May be the nervousness of my first ever flight taking off or the sight of hot air-hostesses making their way off  even with strong ACs blowing right onto my head I was busy wiping the sweat off my forehead While I was caught up in calming my nerves down with a hint of jerk, the flight made its way off the town As my first ever flight started parting away from ground I could see a rushing concrete jungle being left behind within another few moments, I knew I was in mid-air where such a huge flight moved just like a feather in air I was lost peeping through window, with mouth wide open As if a child seeing his 'long-awaited birthday present' open I hardly knew how the next few hours of journey went on until I saw a series of lights ...