Skip to main content

కలల సౌందర్యం

ఇరవై  ఏళ్ళుగా ఎప్పుడూ చూడని ఈ సౌందర్యం
హట్టాతుగా ఎదుట వస్తే ఏమవును నా హృదయం
ఎన్నడూ ఊహించని ఈ అద్భుత తరుణం
కలయూ నిజమో తేల్చుకోలేని సంగ్దిద్దం

చిరుగాలులకి లయబద్ధంగా నర్తించే నీ కురులు
చిరునవ్వుల్లు చిలికించే నీ మధుర అధరాలు
చూపులతోనే మనసు దోచే నీ నయనాలు
చంద్రునికే  ఈర్ష కలిగించే ఆ  మేని అందాలు
చూడగానే అర్పించా నీకయి నా పంచప్రాణాలు
చూస్తూనే గడిపేస్తా నీకయి ఎన్నెనో యుగాలు

తొలిచూపులోనే  పలికించావు నా హృదయంలో సుస్వరం 
మలి చూపులోనే  అర్పించా నీ పాదాలపై నా సర్వస్వం
నీతో మాట్లాడాలని ఉవ్విళ్లూరెను నా యవ్వనం
నీ చెంతకు వస్తే మూగబోయెను నా కంట్టస్వరం

ఏమని చెప్తే తగ్గును నా మదిలోని ఈ భారం
ఎన్నడు తెలియను నీకు నా చూపులోని భావం
తెలియక చస్తున్న నీకు నా మీద ఉన్న అభిప్రాయం
అడగాలంటే అడ్డువస్తోంది నీ మీద ఉన్న అభిమానం

నీతో గడిపిన ఆ అపురూప క్షణములు మధురమే
నీకై విడిచిన ఆ విరహపు నిట్టూర్పులు మధురమే
నీకై నా హృదయంలో కలిగిన అలజడులు మధురమే
నీతో కలిసి బతకాలని ఆశించే నాలోని ప్రేమా మధురమే

Comments

  1. oh.. grr8..!! mastu raasavu raa..
    neelo inta manchi poet unnadani ippude telisindhi..
    intaki aa soundaryaraasi evaroo??

    ReplyDelete
  2. Thanx :) evaro telusthe inka ee gola enduku...

    ReplyDelete
  3. wow!!! wht a g8 poetry:)

    ReplyDelete
  4. Snehithudaina Soorya Sudheera
    kaarya saadhanaloo Soorudavai
    aatankalanu alavokaga chedhinchi
    kalalanu saakaaram chesukoo
    Nee manasunu kadhipina kanyanu
    Manasaara Varinchi Vardhilludhuvu gaaka :)

    "All the Best"

    ReplyDelete
  5. thanx sukra... nuvu naaku old telugu movie dialogues gurthu chesthunnav...... all those SVR movies....

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

నగరం పులికించిన వేళ

భగ భగ మండుతున్న సూర్యుని తాపంతో ఈ మహానగరం మునిగి  ఉండగా  వేసవి  కాలపు  వేడి  గాలులు మెలమెల్లగా వాటి  రాకను తెలుపుతుండగా  జలజలా పారే సేలయేళే వడగాలుల తాకిడికి కదలలేక సేద తీర్చుకుండగా నా ప్రియ భాగ్యనగర రైలుస్టేషన్ లోపలికి వచ్చి ఆగింది నా రైలు సుధీర్గంగా   ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అని వడివడిగా బయటకి సాగెను నా అడుగులు  చుట్టుపక్కల మళ్ళి మళ్ళి చూస్తూ ఏదైనా మార్పుకోసం వెతికేను నా కన్నులు  బిజినెస్ పని మొదల్కొని పిచాపటి మాటల వరకు అన్ని సాగే ఆ ఇరానీ కేఫెలు  ఎప్పుడైనా ఎక్కడైనా కడుపుబ్బా తినేందుకు రోడు పక్కనే ఉన్నా ఛాట్ బండ్లు  నగర చరిత్రకీ అభివృధికీ అద్దంపట్టే ఆ కళాఖండాలు ఇంకా నవనూతన కట్టడాలు తమపర భేదాలు లేకుండా అన్ని పండగలలో ఘనంగా...

సౌందర్య లహరి ... స్వప్న సుందరి

నీ యవ్వనాన్ని తాకాలని ఉవ్విళ్ళూరుతూ పడిలేస్తున కెరటాలు  నిను  చూసి అబ్బురపడి నీకై ఆశగా వంగిన ఆ హరివిల్లు వర్ణాలు  నీ పాద స్పర్శకే తన్మయత్యం చెంది ఎగిరి దుమికే ఇసుక రేణులు ఇవేమీ పట్టనట్టు లోలకంలో కదిలే ఆ నడుము వయ్యారాలు  చూసిన ప్రతిసారి మ్రోగును నా గుండెలో ఆనందపు సరిగమలు నిను చూసిన ఆనదంలో నీ చెంతకే పరుగులు తీసెను నా అడుగులు  అంతలో ట్టక్కున తెరుచు కొనెను మంచి నిద్రనుంచి నా కన్నులూ ఆహా!! ప్రతిదినం నీ దర్శనం నాకు ఈ కలల సామ్రాజ్యంలోనేనా లేక ఎన్నటికైనా నిన్ను కలవాలనే నా చిన్న కోరిక తీరేనా  నేనో  కవినైనా కాకపోతేనే నీ ముఖ ఖవలికలు వర్ణించుటకు  శిల్పినో చిత్రకారుడినో కానే నీ సౌందర్యాని చెక్కి చూసేందుకు ఎన్నాళ్లని ఇలా నా కలలో మెదులుతూ ఊరిస్తూ ఉంటావు   నాకై ఓ క్షణమైనా కనిపించి ఈ మనోవేదన దూరం చెయ్యవూ కలలోనైనా నిను చూసేందుకు  నిద్రలోనే జీవితం గడిపెయనా  లేక నిద్రాహారాలు మాని నీ వెతుకులాటలో ప్రయాణాలు సాగించనా ఎదీ తేల్చుకోలేక మదనపడే ఈ మనసుకు జవాబు దొరికేనా  ఈ సంగ్దిత్త పరిస్తితి నుంచి బైటు వచ్చే మార్గం కనిపించేనా 

మా అన్నయ్య పెళ్ళి కబుర్లు....

మదిలో పులకింతలు మ్రోగించే మేళ తాళాల నడుమ  అంబరమే వంగి చూస్తూ చేసిన కేరింతల మధ్యన  ముక్కోటి దేవుళ్ళ ఆశిరవాదలే చిరుజల్లులై కురిసిన వేల  శ్రవనానందకరమైన వేద మంత్రాలూ నలుదిక్కుల మ్రోగిన వేల  ఇక కానివ్వండీ అని గడియారం ముహూర్తాన్ని సమీపించగా  ఇక తానూ కూడా నిలవలేనని  అడ్డుగా ఉన్న తెర  నేలకూలగా తలవంచిన వధూ వరులు ఓరకంట ఒకరినొకరు చిలిపిగా చూసుకోగా తలపై జీలకర్ర బెల్లం పెట్టి ఒక ఇంటి వాడు అయ్యాడు మా అన్నయ్య పెళ్లి పనులో అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూ ఉండే పెళ్లి పెద్దలు ఎన్నాళ్ళకో కలిసిన చుట్టాలతో ముచ్చట్లలో మునిపోయిన బంధువులు అమ్మా నాన్నల చేతులు విడిపించుకొని మండపమంతా తిరిగేసే చిన్నారులు  వీటనిటిమధ్య ఎప్పుడెప్పుడా అని ఊరించే పెళ్లి భోజనాల ఘుమఘుమలు అప్పుడే కలిసిన కొత్త కొత్త గ్యాంగులు అంతలోనే మొదలైన మా అల్లర్లు శృతి చెప్పిన చీమ ఏనుగు జోకులు, శ్రీ గాడి సమయానుకూల చమక్తులు కీర్తనకు చెప్పిన ఇంజనీరింగ్ విశేషాలు, అను చెప్పిన చిన్ననాటి కహానీలు దీనికి దానికి అని లేకుండా ప్రతి చిన్నదానికి ఫక్కుమని మా నవ్వులు అన్నిటా తన పెద్దరికాన్ని కాపాడుకోడాన...